మనం అందరం ఆర్థికంగా స్వేచ్ఛను పొందాలనుకుంటాం. దీని కోసం కోటి రూపాయలు సంపాదించాలని అనుకోవడం చాలా సాధారణమైన లక్ష్యం. అయితే, ఈ లక్ష్యాన్ని ఎలాంటి రిస్క్ లేకుండా, ప్రభుత్వ భద్రత కలిగిన స్కీం ద్వారా సాధించాలనుకుంటున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఉత్తమమైన మార్గం అని చెప్పొచ్చు.
PPF స్కీం ద్వారా మీరు పెట్టుబడి చేసిన మొత్తంపై ప్రతి ఏడాది వడ్డీకి వడ్డీ (compound interest) లభిస్తుంది. దీని వల్ల పొదుపు చేసిన డబ్బు క్రమంగా పెరిగి, భారీ మొత్తంగా మారుతుంది. అయితే కోటి రూపాయలు సంపాదించాలంటే నెలకు ఎంత సేవ్ చేయాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
PPFలో రూ. 6,000 సేవ్ చేస్తే ఎంత లాభం?
మీరు ప్రతి నెలా రూ. 6,000 PPF ఖాతాలో డిపాజిట్ చేస్తే, సంవత్సరానికి మొత్తం రూ. 72,000 సేవ్ చేసినట్టే. ఈ విధంగా 25 ఏళ్లపాటు మీరు నిరంతరంగా పొదుపు చేస్తే, మొత్తం డిపాజిట్ చేసే మొత్తం రూ. 18 లక్షలు అవుతుంది.
అయితే, ప్రస్తుత PPF వడ్డీ రేటు 7.1% ప్రకారం, 25 ఏళ్ల తర్వాత మీ మొత్తం పొదుపు రూ. 49.47 లక్షలు అవుతుంది. ఇందులో మీ పెట్టుబడి చేసిన రూ. 18 లక్షలు, మిగతా రూ. 31.47 లక్షలు వడ్డీ ద్వారా పెరిగిన మొత్తం.
PPFలో రూ. 12,000 సేవ్ చేస్తే ఎంత లాభం?
మీరు నెలకు రూ. 12,000 PPF ఖాతాలో సేవ్ చేస్తే, సంవత్సరానికి రూ. 1.44 లక్షలు పోగొట్టినట్టవుతుంది. 25 ఏళ్ల పాటు ఈ విధంగా పొదుపు చేస్తే, మొత్తం డిపాజిట్ చేసే మొత్తం రూ. 36 లక్షలు అవుతుంది.
వడ్డీ రేటును 7.1% గా పరిగణిస్తే, 25 ఏళ్ల తర్వాత మొత్తం రూ. 98.95 లక్షలు పొందొచ్చు. ఇందులో రూ. 36 లక్షలు మీరు డిపాజిట్ చేసిన మొత్తం కాగా, రూ. 62.95 లక్షలు వడ్డీ ద్వారా లభించిన మొత్తం.
PPF – రిస్క్ లేకుండా భద్రతతో కోటి రూపాయలు
PPF పొదుపు పథకం ద్వారా మీరు భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు. స్టాక్ మార్కెట్ లాంటి అనిశ్చితి ఉన్న పెట్టుబడులతో పోలిస్తే, PPF పూర్తిగా భద్రతతో కూడుకున్నది. అంతేకాకుండా, దీనిపై పన్ను మినహాయింపు లభించడం వల్ల ఇది మరింత ప్రయోజనకరం.
కాబట్టి, మీరు రిస్క్ లేకుండా, భద్రతతో కూడిన పొదుపు మార్గం కోసం చూస్తున్నట్లయితే, PPF స్కీం సరైన ఎంపిక. మీ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే పొదుపు చేయడం ప్రారంభించండి!