బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా, ఇందులో ఏది బెస్ట్ ? ఎన్ని రకాలు ఉన్నాయి ?

చాల మందికి బంగారంలో పెట్టుబడులు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి అనే విషయంలో స్పష్టత లేక కొందరు ఆలోచిస్తూ ఉంటారు.

బంగారంలో రెండు రకాల పెట్టుబడులు ఉన్నాయి అవి ఒక్కటి ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి మరియు రెండవది డిజిటల్ గోల్డ్ పెట్టుబడి.

ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి అంటే మీరు ఇందులో ఆభరణాలు, బంగారు నాణేలు వంటివి స్వయంగా కొనుకుంటారు.

డిజిటల్ గోల్డ్ పెట్టుబడి అంటే బంగారాన్ని డిజిటల్ గా లేదా ఆన్లైన్ లో యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ సహాయంతో కొనడం.

ఈ రెండు రకాల పెట్టుబడి గురించి తెలిసిన వాళ్ళు వీటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలని కన్ఫ్యూస్ లో ఉంటారు, అయితే వీటిలో ఏది బెస్ట్ అనే విషయాలను ఇప్పుడు మీరు గమనించండి.

ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి :

డైరెక్ట్ గా బంగారం కొనడం అనేది చాలా పాత పద్దతి ఇది అందరికీ తెలిసిన విషయమే, అయితే దీనిలో ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇంకా ధర మారుతున్న కాలం ఆదారంగా మారుతూ ఉంటుంది ఇది కాకుండా మేకింగ్ ఛార్జీల కారణంగా దాని ధర కూడా ఎక్కువ అవుతుంది కానీ డిజిటల్ గోల్డ్ లో అలాంటి ఇబ్బందులు ఉండవు.

ఫిజికల్ గోల్డ్ లో మీరు కనీసం వన్ గ్రాము గోల్డ్ తెసుకోవాలి అనుకున్న కూడా మీరు మినిమమ్ రూపాయలు 7,140/-  22 క్యారెట్ల బంగారం గ్రాముకు మరియు రూపాయలు 7,789/- 24 క్యారెట్ల బంగారం గ్రాముకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుబడి కోసం ఆభరణాల కు కనీసం రూ.20 నుంచి 30 వేలు పెట్టాల్సి ఉంటుంది.

అందులోనూ, మీరు మేకింగ్ ఛార్జీలు ఆధానంగా 20% నుంచి 30% వరకు చెల్లించాలి.

ఈ రోజు మీరు తెసుకున్న ఈ బంగారాన్ని ఫ్యూచర్ లో అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది, ఎంత వస్తుంది అనేది అప్పుడు ఉన్న మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటుంది.

మీ దగ్గర ఉన్న ఈ ఫిజికల్ గోల్డ్ ని లోన్ తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు

ఫిజికల్ బంగారాన్ని జాగ్రత్తగా ఉంచడం చాలా పెద్ద సమస్య, ఎందుకంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది.

డిజిటల్ గోల్డ్ పెట్టుబడి :

డిజిటల్ గోల్డ్ పెట్టుబడి ఆన్లైన్ లో యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ సహాయంతో కొనుగోలు చేయవచ్చు, మన భారత దేశం లో చాలా యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఈ  సదుపాయాన్ని అందిస్తున్నాయి. వీటిలో సేఫ్‌గోల్డ్ బ్రాండ్ ఆఫ్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (MMTC), ప్రొడ్యూట్స్ ఆర్టిస్టిక్ మెటాక్స్ ప్రీసియక్స్, స్విట్జర్లాండ్ (PAMP), డిజిటల్ గోల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టడం చాలా సులభమైనది. వీటిలో ప్రతి యూనిట్ 24 క్యారెట్ల బంగారం, 99.9% స్వచ్ఛతగా హామీ ఇవ్వబడుతుంది.

మీరు డిజిటల్ గోల్డ్ లో రూపాయలు 100/- నుంచి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీని ధర, కొనుగోలు, అమ్మకం మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో డిజిటల్ గోల్డ్ ని  ఒక యూనిట్ కొన్నప్పుడు, ట్రేడింగ్ కంపెనీలు గోల్డ్  స్వచ్ఛతను పరిశీలించి, పెట్టుబడిదారుని పేరు మీద భద్రంగా ఉంచుతాయి. మీరు దానిని అమ్మినప్పుడు వ్యాపార సంస్థ నుంచి గోల్డ్ ని తీసుకుంటుంది.

డిజిటల్ గోల్డ్ లో ఎవరైనా సరే రూపాయలు 100/- నుంచి  కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో కనీస పరిమితి లేదు.

డిజిటల్ గోల్డ్ లో అమ్మడం  ఇంకా పెట్టుబడి పెట్టడం సులభం.

మీరు ఇందులో చాలా సులభంగా యూనిట్లను కొనవచ్చు, అమ్ముకోవచ్చు.

డిజిటల్ గోల్డ్ పెట్టుబడులతో మీరు రుణాలకు తాకట్టులకు  కూడా ఉపయోగించవచ్చు.

డిజిటల్ గోల్డ్ లో  బీమా కూడా చేయబడి ఉంటుంది మరియు  జాగ్రత్తగా ఉంటాయి.

డిజిటల్ గోల్డ్ లో దొంగతనం జరిగే ప్రమాదం ఉండదు మరియు మీరు మీ పెట్టుబడులను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవచ్చు.

1 thought on “బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా, ఇందులో ఏది బెస్ట్ ? ఎన్ని రకాలు ఉన్నాయి ?”

Leave a Comment