మహిళా స్టార్టప్‌లకు నిధులు అందించే ప్రత్యేక ప్రభుత్వ పథకాలు! మహిళలు తమ బిజినెస్‌ను ఎలా ప్రారంభించవచ్చు?

ఒకప్పుడు మహిళలు ఇంటి నుంచి బయటకి వచ్చి జాబ్ చేసే పరిస్తితి లేదు, జాబ్ చేయాలంటే ఇంట్లో పర్మిషన్ కావాలి, ఇంట్లో హస్బండ్ కానీ తల్లిదండ్రులు కానీ పర్మిషన్ ఇవ్వాలి అప్పుడే వాళు జాబ్ చెయ్యడానికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు.

ఇప్పుడు మహిళలు ఇంటి పనులు చూసుకోవడం తో పాటు, ఉద్యోగాలు చేయడమే కాదు, సొంతంగా బిజినెస్ లు  కూడా ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సొంతంగా బిజినెస్  చేయాలనే మహిళలకి ఈ ఆర్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

కొత్తగా బిజినెస్  ప్రారంభించాలనుకునే మహిళలకు భారత ప్రభుత్వం అనేక పథకాల ద్వారా సహాయం అందిస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా ఈ వివరాలను ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం.

ఇప్పుడు మహిళలు తమకు నచ్చిన రంగంలో ముందుకు పోతున్నారు

మహిళలు ప్రస్తుతం కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ ను  కూడా ఎంచుకుంటున్నారు. తాము స్వతంత్రంగా నిలబడాలని నిర్ణయించుకుంటున్నారు.

కొంత మంది మహిళలు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి విజయవంతంగా కొనసాగిస్తున్నారు, ఎంతో మంది కి ఉపాది అవకాశాలని కూడా కల్పిస్తున్నారు. ఎవరైతే మహిళలు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి  అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక బిజినెస్ ఐడియాతో ఉన్నట్లయితే, దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

మహిళలకు అందుబాటులో ఉన్న నిధులు

మహిళా స్టార్టప్‌లకు ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు అందించబడుతున్నాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (SISF) ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, అభివృద్ధి చేసేందుకు నిధులను పొందవచ్చు. ఈ పథకం కింద, ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ. 5 కోట్లు కేటాయించబడుతుంది.

ఈ నిధుల ద్వారా ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెట్ ఎంట్రీ వంటి పనులకు సహాయపడతారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం స్టార్టప్‌లు త్వరగా అభివృద్ధి చెందడంలో సహాయం చేయడమే.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే seedfund.startupindia.gov.in వెబ్‌సైట్‌లో ఫారమ్ నింపి దరఖాస్తు చేయవచ్చు. అందులో మీ వ్యాపార ప్రణాళికను వివరంగా పొందుపరచాలి.

వెంచర్ క్యాపిటల్ (VC) ఫండ్‌లు

వెంచర్ క్యాపిటల్స్ కూడా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. వీటిలో అధిక అభివృద్ధి కలిగిన స్టార్టప్‌లకు పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. కానీ వీటిని సాధారణంగా గుర్తింపు పొందిన పెట్టుబడిదారులు మాత్రమే అందించగలరు.

మహిళా పారిశ్రామికవేత్తల భవిష్యత్తు

మహిళలు తమ బిజినెస్‌ను ప్రారంభించి, సుస్థిరతకు దోహదపడతారు. ఈ పథకాల ద్వారా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక మార్గాలు లభిస్తాయి. ప్రభుత్వం అందించిన సహాయంతో, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి మహిళ తమ బిజినెస్‌ను విజయవంతంగా నడిపేందుకు వీలు కలుగుతుంది.

మీ బిజినెస్ ఐడియాతో ముందుకు రావడానికి ఇదే సరైన సమయం! పథకాలను ఉపయోగించి మీ లక్ష్యాలను చేరుకోండి.

Leave a Comment