అందరికి తెలిసిన విషయం ఏమిటంటే, సంపాదన అంటే మనం పనిచేస్తేనే వస్తుంది. కానీ, కొంత ప్యాసివ్ ఇన్కమ్ ని సొంతం చేసుకోవడం వల్ల, మనం నిద్రపోయినా లేదా ఫ్రీగా ఉన్నా కొంత ఆదాయం వచ్చేవిధంగా ఏర్పరచుకోవచ్చు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో తెలుసుకుందాం!
అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి ?
అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే, మనం రోజూ ఏ పని చేయకుండా రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టి, లేదా ఒక పని ఒక్క సారి చేసేసి, ఆ తర్వాత మళ్ళీ ఆ పని చేయకుండా ఉన్న సరే ఆ ఒక్క సారి చేసిన పని వల్ల వచ్చే సంపాదననే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు.
ఉదాహరణకు రియల్ ఎస్టేట్ లో ఒక ఇల్లు కొని దానిని అద్దె కి ఇవ్వడం ద్వారా మీకు ఏం పని చెయ్యక పోయిన మీకు ప్రతి నెల డబ్బు వస్తూనే ఉంటుంది, స్టాక్స్ డివిడెండ్లు, లేదా బ్లాగ్ నుండి వచ్చే యాడ్‌సెన్స్ ఆదాయం వంటివి ప్యాసివ్ ఇన్కమ్‌లో కి వస్తాయి. దీని ద్వారా మనం మరిన్ని పెట్టుబడులు పెట్టడం లేదా ఇతర ఆర్ధిక లక్ష్యాలు చేరుకోవడం సులభం అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం ఆర్ధిక స్వేచ్ఛను పొందుతాము, ఎందుకంటే ఇది క్రమంగా మన సంపదను పెంచడానికి సహాయపడుతుంది.
1. ఇన్వెస్ట్‌మెంట్స్ (బ్యాంక్ స్కీమ్స్, ఎఫ్‌డి, మ్యూచువల్ ఫండ్స్)
మన దగ్గరున్న డబ్బును సురక్షితంగా బ్యాంక్ స్కీమ్స్ లో, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ లో, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనకి రెగ్యులర్ గా ఆదాయం వస్తుంది. దీని ద్వారా మంచి వడ్డీ రేటుతో నెలకు గాను అలానే సంవత్సరం లాభాలు పొందవచ్చు.
2. ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్
ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీస్ లో పెట్టుబడులు పెట్టడం మంచి ఆలోచన. ఇల్లు లేదా ఫ్లాట్ లాంటి ప్రాపర్టీస్‌ను అద్దెకు ఇస్తే నెల నెలా ఒక ఫిక్సెడ్ ఆదాయం వస్తుంది. దీనికి ప్రాపర్టీ బాగా పరిశీలించి కొనుక్కువాలి అని గుర్తుంచుకోవాలి.
3. వీడియో కంటెంట్ క్రియేషన్
యూట్యూబ్ వంటి వీడియో ప్లాట్‌ఫారమ్స్‌పై మీకు ఇష్టమైన టాపిక్స్‌పై వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే ప్రేక్షకులు అలాగె చూడటం వల్ల, యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ కూడా వస్తుంది.
ఇలా మీకు ఇష్టమైన టాపిక్స్‌పై వీడియోలు తయారు చేయడాన్ని కంటెంట్ క్రియేషన్ అంటారు అంటే ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా మీకు ఆదాయంగా వస్తుంది.
4. బ్లాగింగ్
మీకు రాయడంపై ఆసక్తి ఉంటే, మీకు ఇష్టమైన టాపిక్స్‌పై బ్లాగ్ ని స్టార్ట్ చెయ్యండి. పలు విభాగాలపై మీకున్న జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా బ్లాగ్‌లో గూగుల్ యాడ్‌సెన్స్, అఫిలియేట్ లింక్స్ వంటి మార్గాల్లో ఆదాయం పొందవచ్చు.
ఈ బ్లాగింగ్ గురించి పూర్తిగా ఒక ఆర్టికల్ వ్రాస్తాను, అది చదవడం కోసం మన టెలిగ్రాం చానెల్ లో జాయిన్ అవ్వండి.
5. పొదుపు పథకాలు
ప్రభుత్వానికి సంబంధించిన పొదుపు పథకాలు (చిట్టీలు, వంటి) డబ్బు సురక్షితంగా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ పథకాల ద్వారా ఒక నిర్ధిష్ట కాలానికి సేవ్ చేసిన తరువాత లాభం పొందవచ్చు.
6. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్
స్టాక్స్, షేర్లలో పెట్టుబడులు పెడితే, వాటి మార్కెట్ విలువ పెరిగినప్పుడు లాభం పొందవచ్చు. దీన్ని కొంత రిస్క్ ఉండే పెట్టుబడిగా భావించినా, జాగ్రత్తగా పరిశోధన చేసి పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
7. అఫిలియేట్ మార్కెటింగ్
మీకు తెలిసిన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ను ప్రమోట్ చేయడం ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కమీషన్ పొందవచ్చు. ఉదాహరణకు, మీకు బాగా తెలిసిన లేదా ఉపయోగించుకున్న ప్రొడక్ట్స్ ను మీ బ్లాగ్ లేదా వెబ్సైట్ ద్వారా రిఫర్ చెయ్యడం ద్వారా ఆదాయం వస్తుంది.
8. డిజిటల్ ప్రొడక్ట్ లు లేదా ఈ-బుక్స్
మీకు ప్రత్యేకమైన నాలెడ్జ్ ఉన్న ఏదైనా సబ్జెక్ట్ పై ఈ-బుక్ రాయండి లేదా డిజిటల్ ప్రొడక్ట్ (వీడియో కోర్సు, ఇ-బుక్) తయారు చేయండి. వీటిని ఒకసారి తయారు చేసి అమ్మడం వల్ల రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు.
Conclusion:
ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ తో, మీ సమయాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించవచ్చు.