అందరికీ ఫ్యూచర్ లో ఆర్ధిక పరిస్తితి బాగుండాలి అంటే మనం సంపాదించే దానిలో కనీసం 30 పర్సెంట్ అయిన మనం సేవింగ్స్ చేసుకోవాలి. అలానే ఫ్యూచర్ లో మన పై ఆదరిపడి ఉన్న వాళ్ళకి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏదయినా జీవిత బీమా పాలసీని తీసుకోవాలి. అప్పుడే మన కుటుంబానికి ఒక ఆర్ధిక బరోసా ఉంటుంది.
ఇప్పుడు ఉన్న పరిస్తితులలో అందరికీ అవసరమైన పాలసీ ఏదైనా ఉంది అంటే ఈ జీవిత బీమా పాలసీ యే, ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న కాలం లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం ఇ ట్రాఫిక్ లో ఉదయం ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళటం చాలా ఇబ్బందిగా తయారైంది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే ముందు జాగ్రత్తగా ఈ జీవిత బీమా పాలసీ తీసుకోవడమే మంచింది.
అయితే, ఇప్పుడు ఉన్న కార్చులకి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ప్రీమియం ఖర్చు ఎంత వరకి ఉండాలి, ముఖ్యంగా కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఏ వయస్సులో తీసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు?
కుటుంబ సభ్యులకు అనుకోని ఆర్థిక సాయం అవసరం అయినప్పుడు, కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్ వారికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, వారికి ఆదాయం ఉండదు కాబట్టి ఆర్థిక సమస్యలు ఎదురైన సందర్భాలలో ఈ ఇన్సూరెన్స్ వారికి చాలా ఉపయోగపడుతుంది. జీవిత బీమా ద్వారా వారికి ఆర్థిక భారం లేకుండా సహాయం అందించడం ద్వారా కుటుంబం సురక్షితంగా ఉంటుంది.
కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం ద్వారా వారికి కనీస అవసరాలకి ఇంకా చదువుకి కావాల్సిన మనీ కోసం కూడా ఉపయోగపడుతుంది.
కోటి రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు ఎంత?
కోటిరూపాయల జీవిత బీమా ప్రీమియం ఖర్చు వయస్సు, ఆరోగ్యం, పాలసీ గడువు, మరియు ఇన్సూరెన్స్ కంపెనీ లపై ఆధారపడి మారుతుంటుంది.
ఉదాహరణకు, 25 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి కోటి రూపాయల బీమా కోసం సంవత్సరానికి సుమారు రూపాయలు 8,000 నుంచి రూపాయలు 10,000 మధ్య చెల్లించవచ్చు. అయితే వయస్సు పెరుగుతూ ఉంటే ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కావడంతో ప్రీమియం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎప్పుడు ఈ జీవిత బీమా తీసుకోవాలి?
ఈ జీవిత బీమా తీసుకోవడానికి సరైన వయస్సు చాలా ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ వయస్సులో తీసుకుంటే, ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాబట్టి ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా, చిన్న వయస్సులోనే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల పాలసీ గడువు కూడా ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుంది.
మీరు ఒకవేళ 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న సరే ఈ జీవిత బీమా పాలసీ తీసుకోండి కాకపోతే మీరు కట్టాల్సిన ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
మీరు మీ కుటుంబానికి కచ్చితంగా ఈ జీవిత బీమా పాలసీ తీసుకోవడం ద్వారా మీరు మీ కుటుంబాన్ని ఆర్ధికంగా రక్షించినవారు అవుతారు.
మనం చెల్లించే ప్రీమియం ఖర్చును తగ్గించడానికి సూచనలు:
- సరైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం: ఇన్సూరెన్స్ అందించే కంపెనీలలో ప్లాన్లను పరిశీలించి, మీకు సరిపోయే ప్లాన్ తీసుకోవడం మంచింది.
- ఆరోగ్య పరిస్థితులు: మనం మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు హాస్పిటల్ లో చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం కట్టే ప్రీమియంలో తగ్గుదల కి సాధ్యపడుతుంది.
- ప్రముఖ కంపెనీలతో పోల్చుకోవడం: మార్కెట్లో ఉన్న వివిధ కంపెనీల ఆఫర్లను చూస్తూ, నమ్మకమైన కంపెనీని ఎంచుకోవడం ఉత్తమం.
5