ఇక ఇంట్లో కూర్చునే పోస్టాఫీస్ పొదుపు పథకాలలో చేరొచ్చు –

ఇక ఇంట్లో కూర్చునే పోస్టాఫీస్ పొదుపు పథకాలలో చేరొచ్చు – ఆధార్ ఉంటే చాలు!

పోస్టాఫీస్ పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం అదిరే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకాలలో చేరేందుకు పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి కూర్చునే ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది పూర్తిగా పేపర్‌లెస్ ప్రాసెస్, ఫాస్ట్‌గా పూర్తయ్యే డిజిటల్ ప్రక్రియ.

ఏప్రిల్ 23, 2025 నుంచి అమలులోకి

భారతీయ తపాలా శాఖ (Post Office) ఏప్రిల్ 30న విడుదల చేసిన తాజా సర్క్యూలర్ ప్రకారం, ఏప్రిల్ 23, 2025 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఇకపై మీరు ఈ పథకాలలో ఇ-కేవైసీ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు:

  • మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)
  • టైమ్ డిపాజిట్ (TD)
  • కిసాన్ వికాస్ పత్ర (KVP)
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

ఆధార్‌ ఉండి, ఇంటర్నెట్‌ యాక్సెస్ ఉంటే చాలు

ఈ కొత్త పద్ధతిలో, మీ ఆధార్ నెంబర్‌తో బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తయిన తరువాత, పేపర్ వర్క్ లేకుండానే పొదుపు ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఇప్పటికే కొత్త కస్టమర్లకు జ‌న‌వ‌రి 6, 2025 నుండి సేవింగ్స్ ఖాతాల‌కు ఇ-కేవైసీ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకూ విస్తరించారు.

ప్రజలలో విశేష ఆదరణ

ఈ పోస్టాఫీస్ పొదుపు పథకాలు ప్రజలలో విశేష ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా మంచి వడ్డీ రేట్ల కారణంగా ఎక్కువమంది ఈ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇకపై అకౌంట్ ఓపెన్ చేయడం మరింత సులభం కావడంతో, మరింత మంది ఈ పథకాల వైపు మొగ్గుచూపే అవకాశముంది.

సందేహాలుంటే?

మీకు ఏవైనా సందేహాలు ఉంటే, సమీప పోస్టాఫీస్ బ్రాంచ్‌కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా ఆన్‌లైన్‌లోనే ఖాతా ఓపెన్ చేయవచ్చు

ఇక పొదుపు మొదలుపెట్టడం అసాధ్యమేం కాదు. ఆధార్ కార్డ్‌ ఉండి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు – ఇంట్లోంచే ప్రభుత్వ పొదుపు పథకాలలో చేరిపోవచ్చు!

Leave a Comment