Rajiv Yuva Vikasam: రూ.50,000 రుణం – రూపాయి కూడా తిరిగి కట్టక్కరలేదు! మీరు అర్హులేనా?
ఇప్పటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకంటే సొంతంగా వ్యాపారం చేయడం ఎక్కువ మంచిదిగా మారుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అనేక విధాలుగా తోడ్పాటునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఉదాహరణగా “రాజీవ్ యువ వికాసం” అనే పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రుణాలు ఇస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే – ఈ రుణాలపై 100% సబ్సిడీ లభిస్తుంది. అంటే రూ.50,000 తీసుకుని… రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు!
ఈ పథకంలో ఎవరు అర్హులు?
- గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1.5 లక్షలు మించకూడదు
- పట్టణాలలో నివసించే వారి ఆదాయం ₹2 లక్షలు మించకూడదు
- వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి
- రేషన్ కార్డు తప్పనిసరి (లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం ఉపయోగించవచ్చు)
మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈ పథకంలో 25% నిధులు మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.
మీ ఇంట్లో మహిళ పేరుతో అప్లై చేస్తే రుణం మంజూరు అయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.
అంతేకాదు, వితంతువులైన మహిళలకు మొదటి ప్రాధాన్యం లభిస్తుంది.
సబ్సిడీ ఎలా ఉంటుంది?
- ₹50,000 రుణం తీసుకుంటే – 100% సబ్సిడీ (రూపాయి కూడా తిరిగి చెల్లించనవసరం లేదు)
- ₹1 లక్ష రుణం తీసుకుంటే – 90% సబ్సిడీ (కేవలం ₹10,000 మాత్రమే చెల్లించాలి)
- ₹2 లక్షల లోపు రుణం – 80% సబ్సిడీ
- ₹4 లక్షల లోపు రుణం – 70% సబ్సిడీ
బ్యాంకు ద్వారా మిగిలిన మొత్తం కూడా లోన్ రూపంలో ఇవ్వబడుతుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోండి:
- ప్రతి ఇంటికి ఒక్కరికి మాత్రమే ఈ రుణం లభిస్తుంది
- ఇది వ్యాపారం కోసం మాత్రమే – ఉద్యోగం కోసం కాదు
- రుణం తీసుకున్న తరువాత వ్యాపారం ప్రారంభించాలి
📣 మీరు కూడా అర్హులైతే… ఈ అవకాశాన్ని వదులుకోకండి!
మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, స్వయం ఉపాధిని సాధించడానికి ఇది మంచి అవకాశం. ఈ పథకానికి దరఖాస్తు చేయండి, మీ స్వంత వ్యాపారం ప్రారంభించండి… మరియు ప్రభుత్వ సాయంతో ముందుకు సాగండి!
పథకం ముఖ్యాంశాలు:
- మొత్తం బడ్జెట్: రూ.10,000 కోట్లు
- లబ్దిదారుల సంఖ్య: సుమారు 5 లక్షల మంది యువత
- సబ్సిడీ + రుణ సౌకర్యం: రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం
- గడువు: ఏప్రిల్ 14, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
- లక్ష్యం: స్వయం ఉపాధి అవకాశాల ద్వారా యువత ఆర్థికంగా స్థిరపడటందరఖాస్తు విధానం:
దరఖాస్తు విధానం:
- వెబ్సైట్ సందర్శించండి https://tgobmms.cgg.gov.in
- “Rajiv Yuva Vikasam Scheme Registration” పై క్లిక్ చేయండి
- ఆధార్, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేసుకోండి
- దరఖాస్తు ఫారమ్ పూరించండి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- సమీక్షించి సబ్మిట్ చేయండి
గమనిక: ఆదాయ ధృవీకరణ అవసరం లేదు — రేషన్ కార్డు ఉంటే చాలు!
అర్హతలు:
- స్థిర నివాసం: తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి
- వయస్సు: 18-35 సంవత్సరాలు (కొన్ని పథకాలకి 21-60)
- కులాలు: SC, ST, BC, మైనారిటీ, EWS/EBC
- ఉపాధి స్థితి: నిరుద్యోగి అయి ఉండాలి
- లక్ష్యం: స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం కావాలి
రాజీవ్ యువ వికాసం పథకం గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి