కరోనా మహమ్మారి వచ్చి మన జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్ క్లాస్ లు స్టార్ట్ చేశారు, అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను ఇచ్చాయి. ఈ పద్ధతిలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం స్టార్ట్ చేశారు.
ఇంటి దగ్గరుండి జీతం సంపాదించాలనే ఆలోచన మనలో చాలా మందిలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇంటి నుంచే, ఆఫీసుకు వెళ్లకుండానే, ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ ఉద్యోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అందులో మొదటిది
1. డిజిటల్ మార్కెటింగ్
ఇటీవలి కాలంలో డిజిటల్ మార్కెటింగ్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుంది. స్మాల్ బిజినెస్ ఓనర్స్ దగ్గరి నుంచి బిగ్ కాంపిణీస్ వరకి ఆన్లైన్లో మార్కెటింగ్ అందరికీ అవసరం ఉంది. ఆన్లైన్ లో SEO, సోషల్ మీడియా లో కంటెంట్ క్రియేషన్ ద్వారా కస్టమర్లను అట్రాక్ట్ చేయడం డిజిటల్ మార్కెటర్ల పని. ఈ ఫీల్డ్‌లో మంచి టాలెంట్ ఉంటే, డిమాండ్ గ్యారంటీ!
ఒక్కో క్లయింట్ కి 5 వేల నుంచి 10 వేలు తీసుకున్న నెలకి ఒక 10 క్లయింట్ ని చూసుకున్న కూడా మనకి ఈసీ గా 50 వేల నుంచి ఒక లక్ష వరకి సంపాదించవచ్చు.
2. వెబ్ డిజైనర్
వెబ్సైట్ లేకుండా ఈరోజుల్లో బిజినెస్ చేయడం కష్టమనే చెప్పాలి. అందుకే, ప్రతి బిజినెస్ కి వెబ్సైట్ చాలా అవసరం ఉంది. ఆల్రెడీ ఆన్లైన్ లో చాలా కాంపిణీస్ చాలా తక్కువ దరకి హోస్టింగ్ అండ్ డొమైన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, హ ప్లాన్స్ ని మనం తీసుకొని ఒక్కో బిజినెస్ ఓనర్స్ కి మనం వెబ్సైట్ డిజైన్ చేసి చార్జి చేయవచ్చు.
3. సాఫ్ట్వేర్ డెవలపర్
సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం ఇప్పుడు ఎక్కువ ఆదాయాన్ని అందించే జాబ్ లో ఒకటి. మీరు ప్రోగ్రామింగ్ స్కిల్స్‌లో నేర్చుకుంటే, యాప్స్, లేదా సాఫ్ట్వేర్లను డిజైన్ చేసి దాని ద్వారా మంచి జీతాన్ని సంపాదించ వచ్చు. ఐటి ఫీల్డ్ లో కొనసాగుతున్న బూమ్ వల్ల ఈ ఫీల్డ్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
4. కంటెంట్ రైటర్
మీకు రాయడం అంటే ఇష్టం ఉంటే గనుక, కంటెంట్ రైటర్‌గా మారండి. బ్లాగులు, వెబ్సైట్ కంటెంట్, స్టోరీస్ రైటింగ్ వల్ల ఆదాయం సంపాదించ వచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్స్ మీద రాసే వారికి మరింత అవకాశాలు ఉంటాయి.
ఆన్లైన్ లో ఫ్రీలాన్స్ రైటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. అలానే చాలా వెబ్సైట్సు మనం రాసే ఆర్టికల్స్ కి మనీ కూడా ఇస్తాయి.
5. గ్రాఫిక్ డిజైనర్
లోగోలు, బ్రోచర్లు, సోషల్ మీడియా పోస్ట్స్ కోసం గ్రాఫిక్ డిజైనింగ్ ఉద్యోగాలు ఇప్పుడు చాలా క్రేజీగా మారాయి. మంచిగా నేర్చుకుంటే దీని మీద సంపాదించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఇది కూడా మంచి కెరీర్ మార్గం.
గ్రాఫిక్ డిజైన్ కి ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్సు వచ్చాయి అందులో కణ్వ ఇప్పుడు చాలా ఫేమస్, ఇందులో మనం ఈసీ గా డిజైన్ చేస్కోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏం కావాలో హ టెంప్లేట్ ఇందులో ఉంటాయి. ఈసీగా కంటెంట్ కాపీ పేస్ట్ చేసి డిజైన్ రెఢీ చేయవచ్చు టైమ్ కూడా సేవ్ అవుతుంది.
6. ఆన్లైన్ ట్యూటర్
కరోనా తర్వాత ఆన్లైన్ లో ట్యూషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. స్టూడెంట్స్‌కు మ్యాథ్స్, సైన్స్, లేదా కోడింగ్ వంటి సబ్జెక్టులను ఆన్లైన్లో ట్యూషన్ల లు చెప్పడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించ వచ్చు.
Conclusion:
ఇంటి దగ్గర నుంచే పనిచేసే జాబ్స్ ఇప్పుడు చాలా ప్రాధాన్యత పొందుతున్నాయి. ఇంటరెస్ట్, టాలెంట్ మరియు మోటివేషన్ ఉంటే, ఈ ఉద్యోగాల్లో ఒకదాన్ని ఎంచుకుని మంచి ఆదాయం సంపాదించవచ్చు. మీరు కూడా ట్రై చేయండి!