డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి ? డబ్బు సమస్య రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి ? భవిష్యత్తులో ఫైనాన్స్ ఫ్రీడం కోసం !

ఆదాయం, ఖర్చు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం, భద్రత  అనే నాలుగు ప్రధాన అంశాలను బట్టి మన  ఆర్థిక పరిస్థితిని చెప్పవచ్చు. మంచి ఆర్థిక భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది మొదటి, ముఖ్యమైన అడుగు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వ్యక్తిగత ఆర్థిక నియంత్రణ అనేది కేవలం ఖర్చులు -సేవింగ్స్ ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులోని అవసరాలకు కూడా సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

వ్యక్తిగత ఆర్థిక నియంత్రణ అంటే మన డబ్బును కరెక్ట్ గా ఖర్చు చెయ్యడం, పొదుపు చేయడం, భద్రత కల్పించడం. దీనివల్ల మన భవిష్యత్తు కోసం సరైన ప్లాన్  చేయడం సులభమవుతుంది. మంచి ఆర్థిక భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు  ఇప్పుడు తెలుసుకుందాం.

1. బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం:

మనం సంపాదించిన డబ్బును అవసరాలకు సరిపోయేలా ఒక ప్లాన్  చేసుకోవడం అవసరం.

  • కనీస అవసరాలకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి : ప్రతి నెలకు ఎంత  అవసరాలు ఉన్నాయి, చెల్లింపులు ఎంత ఉన్నాయి లాంటి వాటికి ముందుగానే బడ్జెట్ సెట్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా స్థిరంగా ఉండొచ్చు.
  • అవసరంలేని ఖర్చులను తగ్గించడం : అవసరంలేని ఖర్చులను తగ్గించడం లేదా అసలు ఖర్చు చేయకపోవడం ద్వారా దాని ద్వారా మిగిలిన డబ్బును సేవింగ్స్ లో పెట్టుకోవచ్చు, దాంతో మనకు కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది.

2. సేవింగ్స్ అలవాటు చేసుకోవడం:

ప్రతీ నెలలో మనం సంపాదించిన దానిలో కొంత శాతం వరకు  సేవింగ్స్  చేయడం ఎంతో ముఖ్యం.

  • ఒక లక్ష్య తో  పొదుపు చేయడం: మన ఆదాయంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పెట్టుకుంటే, అనుకోని పరిస్థితుల్లో మనకి ఉపయోగపడుతుంది.
  • (ఎమర్జెన్సీ ఫండ్): అనుకోకుండా మనకి ఆరోగ్యం బాగోక పోయిన, ఉద్యోగం కోల్పోయినా మనీ  సమస్యలు వెంటనే మనల్ని వెంబడిస్తాయి. అలాంటి సమయం లో మనల్ని ఆదుకునేందుకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం మంచిది. ఒక సంవత్సరానికి  లేదా ఆరు నెలలకి ఎంత ఖర్చు వస్తుందో దానికి అవసరమైన  డబ్బును ముందుగానే మనం బ్యాంకులో సేవ్ చేసుకోవడం మంచిది.

3.  సంపాదించిన మనీ లో కొంత భాగం పెట్టుబడులు చేయడం

పొదుపు చేయడం ఎంత ముఖ్యమో, పెట్టుబడులు చేయడం కూడా అంతే అవసరం.

  • చిన్న పెట్టుబడులు: SIPలు, మ్యూచువల్ ఫండ్లు లాంటివి తక్కువ డబ్బుతో పెట్టుబడికి మంచి లాభాలు ఇస్తాయి.
  • బాధ్యతాయుతమైన పెట్టుబడులు: స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రియల్ ఎస్టేట్ వంటి భద్రతా వ్యాపారాల్లో పెట్టుబడులు మన భవిష్యత్తుకు భద్రతను  కల్పిస్తాయి.

4. జీవిత, ఆరోగ్య బీమా అవసరం

ఆకస్మిక పరిస్థితుల్లో కుటుంబానికి, మన ఆరోగ్యానికి రక్షణ కల్పించేలా జీవన బీమా, ఆరోగ్య బీమా తీసుకోవడం ముఖ్యం.

  • జీవిత బీమా: భవిష్యత్తులో కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తుంది.
  • ఆరోగ్య బీమా: అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్  ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది.

ఇవి పాటించడం ద్వారా మన ఆర్థిక భద్రతను పెంచుకోవచ్చు.

1 thought on “డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి ? డబ్బు సమస్య రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి ? భవిష్యత్తులో ఫైనాన్స్ ఫ్రీడం కోసం !”

Leave a Comment