మీ యొక్క సొంత వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం ప్రదానమంత్రి ఉపాది కల్పన కార్యక్రమం కింద సూక్ష్మ , చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఏకంగా 20 లక్షల వరకు  ఎటువంటి హామీ లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహాయాన్ని అందచేస్తుంది.

పెట్టుబడి కోసం ఎదురుచూసే చిన్న ,మధ్యతరహా పరిశ్రమలకు ఇది ఒక మంచి అవకాశమనే చెప్పొచ్చు. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు కదా!

కేంద్ర ప్రభుత్వం అందజేసే ఇలాంటి పతకాలను మనం కొద్దిగా ప్రయత్నిస్తే మనకి ప్రయోజనం ఉంటుంది.

ఈ పథకాన్ని ఎలా అప్లై చెయ్యాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

ఈ పథకం పేరు ప్రధానమంత్రి ఉపాది కల్పన పథకం దీన్ని ఇంగ్లీష్ లో( PM EMPLOYMENT GENERATION PROGRAM )(PMEGP) అని కూడా పిలుస్తారు.

ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రుణం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుంది.

ఈ అమౌంట్ డైరెక్ట్ గా  వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది.

కేంద్రం ఈ అమౌంట్ లో సబ్సిడీ కూడా ఇస్తుంది.

రేట్ ఆఫ్ (మార్జిన్ మనీ )సబ్సిడీ (ఆఫ్ ప్రోజెక్ట్ కాస్ట్ ) కింద అర్బన్ ఏరియా లో 15% సబ్సిడీ రూరల్ ఏరియాలో 25% వరకు సబ్సిడీ ఇస్తుంది.

మిగతా డబ్బును రుణం పొందిన వ్యక్తి వాయిదాల పద్దతిలో చెల్లించవవచ్చు.

అర్హతలు:

వ్యక్తి వయస్సు 18 ఏళ్ళు దాటి ఉండాలి, కనీసం 8 వ తరగతి పాసై ఉండాలి.

కావాల్సిన పత్రాలు :

PMEGP పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే వారి దగ్గర

  • 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
  • ఆధార్ కార్డ్
  • కుల దృవీకరణ పత్రం (sc ,st ,obc /minority/phc)
  • అత్యున్నత విద్యార్హత సర్టిఫికేట్
  • E d p ట్రైనింగ్ సర్టిఫికేట్
  • రూరల్ ఏరియా సర్టిఫికేట్
  • ప్రోజెక్ట్ రిపోర్ట్

ఉండాలి

మీరు ఈ పథకం కింద రుణం తీసుకోవాలి అంటే ముందుగా మీరు చేయ్యాల్సిన మొట్టమొదటి పని  ఏంటంటే మీరు చేయాలనుకుంటున్న వ్యాపారానికి సంబంధించిన ప్లాన్ ని కరెక్ట్ గా  ఒక ప్రోజెక్ట్ రిపోర్ట్ లా తయారు చేయండి ,అంటే మీరు ఏం వ్యాపారం చేయాలనుకుంటున్నారు ,దానికి కావాల్సిన మెటీరీయల్  కి సంబంధించిన డీటైల్స్ ఇంకా ఎంత ఖర్చు అవుతుంది, డీటైల్ గా  ఒక రిపోర్ట్ రెఢీ చేసుకోండి.

ఉదాహరణకి -వ్యవసాయానికి అనుబంధ రంగాలు అయిన కోళ్ళ ఫారాలు, చేపల పెంపకం, పండ్లు, కూరగాయలు అమ్మకాలు, టిఫిన్ సెంటర్లు, చిన్న చిన్న దుకాణాలు ఎటువంటి వ్యాపారం అయిన  సరే మీకంటూ ఒక ప్లాన్ తో రిపోర్ట్ ని రెఢీ చేసుకోండి.

ఆన్లైన్ లో అప్లై చేసుకునే విదానం :

మీరు ముందుగా కింద ఇవ్వబడిన

వెబ్సైట్ ని సంప్రదించండి.

 వెబ్సైట్ ఓపెన్ చేశాక Application For New Unit కింద అప్లై అనే బటన్ ని క్లిక్ చేయండి.

దరఖాస్తుఫారం ఓపెన్ అవుతుంది.

అందులో మీ యొక్క వివరాలు నింపాలి.

తర్వాత కావాల్సిన పత్రాలు అప్లోడ్ చెయ్యాలి.

అన్నీ పూర్తిగా నింపాక సబ్మిట్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.

ఆ తర్వాత అధికారులు పరిశీలించి,అనుమతి ఇస్తారు.

ఆ తర్వాత బ్యాంక్ నుంచి రుణం వచ్చేలా కేంద్రం చూసుకుంటుంది.

ఆఫ్లైన్ లో అప్లై చేసుకునే విదానం :

పైన ఉన్న లింకు మీద క్లిక్ చేసి దరఖాస్తు పారం డౌన్లోడ్ చేసుకొని, పారం ని ప్రింట్ తీసుకొని అన్నీ వివరాలు నింపాలి తర్వాత అవసరమైన పత్రాలు జత చేసి అన్నింటినీ కలిపి రాష్టం లోని క్విక్/క్వయిబ్/డిక్/కాయర్ బోర్డు అధికారులకు ఇవ్వాలి. వాళ్లు మీ పారం ని తీసుకున్నాక మీకు ఒక స్లీప్ ఇస్తారు రిఫరెన్స్ కోసం దానిని మీ  దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోవాలి అలానే పారం స్టేటస్ తెలుసుకోవడానికి ఆ స్లీప్ మీకు ఉపయోగపడుతుంది.

Leave a Comment